JOIN THE MAA MAHILA
జననం నీవే – గమనం నీవే
సృష్టివి నీవే – కర్తవు నీవే
కర్మవు నీవే – — ఈ జగమంతా నీవే…….!
అందుకే భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక
ప్రతి ఇంటిలోను నిన్ను సృష్టించాడు…..!!!
ఓ మహిళా నీకిదే మా వందనం.
…………………………………………………………………………..
సృష్టికి ప్రతిసృష్టి నిచ్చి…. ప్రేమతో ప్రాణం పోస్తుంది.. “మహిళ”
నవమాసాలు మోసి కని కంటికి రెప్పలా పెంచుతుంది.. “మహిళ”
తొలి అడుగు తానై నడిపిస్తుంది.. “మహిళ”
ఓర్పుకు, నేర్పుకు, ఓదార్పుకు మార్గదర్శి.. “మహిళ”
తెగువకు, త్యాగానికి నిదర్శనం.. “మహిళ”
ఆకాశంలోను, అంతరిక్షంలోను రంగం ఏదైనా ధైర్యంతో ముందడుగు వేస్తుంది.. “మహిళ”
ఇంటికి వెలుగు.. “మహిళ” అబల కాదు సబల ఈ.. “మా మహిళ”
సంసార సాగరంలో ఆమెకు ఆమె సాటిగా ఆత్మీయతలో అనురాగాన్ని పంచే
ఓ అమృతమూర్తి నీకిదే మా వందనం.
- ప్రతి మహిళకు ఓ కళ ఉంటుంది. ఆ కళలను సాకారం చేసుకోవడానికి ముందడుగు వేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ప్రతి మహిళ మీలో ఉన్న ప్రతిభను బయటి ప్రపంచానికి తెలియపరిచి ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతోంది “మా మహిళ”.
- ఎవరైతే నిరంతరం తనను తాను విశ్లేషించుకుంటూ ప్రతి పనిలోనూ కృషి పట్టుదల సాధించాలి అనుకునే మహిళలందరికి చేయూతనిస్తుంది “మా మహిళ”.
- మీరు చేసే ప్రతి పనిలో గెలుపైన, ఓటమైన ధైర్యంగా ముందడుగు వేయాలనుకుంటున్న ప్రతి మహిళ విజయానికి అండగా ఉంటుంది “మా మహిళ”.
- వృత్తి ఏదైనా సరే… నియమ నిబద్ధతతో తనకు తాను సాటిగా నిలబడి నచ్చిన రంగాన్ని ఎంచుకుని చేసే పనిని సంతోషంతో వృత్తి మీద నమ్మకం ఉంచి ముందుకు సాగిపోవాలనుకుంటున్న ప్రతి మహిళతో ముందడుగు వేస్తుంది “మా మహిళ”.
- తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టిన వృత్తి అధిక లాభాలతో మరియు మరొకరికి చేయూతనిచ్చి లేదా ఉపాధి కల్పించాలి అనుకుంటున్న ప్రతి మహిళకు తోడుగా నిలుస్తుంది “మా మహిళ”.
——————————————————————–
స్త్రీ కనులు తెరిచిన క్షణం నుంచి బంధం కోసం బాధ్యత కోసం కుటుంబం కోసం అందర్ని కనుపాపలా.. తలచి ఆత్మీయతను పంచి తన వారికోసం అహర్నిశలు కష్టించి, వారి కలలని పోషించి, అవమానాన్ని సహించి, వారి భవిష్యత్తు గురించి తన ఇంటిని నందనవనం చేసే స్త్రీకి పాదాభివందనం.